తెలంగాణ, నల్గొండ. 30 జూలై (హి.స.)
ప్రతి నిరుపేద కుటుంబానికి సన్న బియ్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ అన్నారు. బుధవారం దేవరకొండ పట్టణంలోని మార్కెట్ యార్డ్లో నూతన రేషన్ కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఉన్న అర్హులందరికీ నూతన రేషన్ కార్డులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క నిరుపేద సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు