ఈడీ అదుపులో తలసాని మాజీ OSD కళ్యాణ్
హైదరాబాద్, 30 జూలై (హి.స.) బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ యొక్క మాజీ ఓఎస్డీ కళ్యాణ్ కుమార్ ను నేటి మధ్యాహ్నం ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. గొర్రెల పంపిణీ స్కీంలో రూ. 700 కోట్ల కుంభకోణం జరిగినట్లు ఏసీబీ నమోదు చేసిన
ఈడి దాడులు


హైదరాబాద్, 30 జూలై (హి.స.)

బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ

మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ యొక్క మాజీ ఓఎస్డీ కళ్యాణ్ కుమార్ ను నేటి మధ్యాహ్నం ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. గొర్రెల పంపిణీ స్కీంలో రూ. 700 కోట్ల కుంభకోణం జరిగినట్లు ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఎఆర్ ఆధారంగా ఈడీ అధికారులు కళ్యాణ్ ఇంటితో సహా హైదరాబాద్లోని ఎనిమిది ప్రాంతాల్లో బుధవారం సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో పలు కీలక డాక్యుమెంట్లు, భారీగా నగదును స్వాధీనం చేసుకున్నారు. కళ్యాణ్ను సుమారు 7 గంటల పాటు విచారించినట్లు సమాచారం.

ఈ కేసు గత ప్రభుత్వం హయాంలో అమలు చేసిన గొర్రెల పంపిణీ స్కీంలో జరిగిన ఆర్థిక అక్రమాలకు సంబంధించినది కాగా... ఈ స్కీంలో రూ. 700 కోట్ల నిధులు దుర్వినియోగం అయినట్లు ఏసీబీ ఆరోపించింది.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande