అమరావతి, 30 జూలై (హి.స.)
నెల్లూరు, కావలి పట్టణంలోని స్రవంతి థియేటర్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. హీరో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ సినిమా రిలీజ్ కోసం థియేటర్‌లో మరమ్మతులు చేస్తుండగా అగ్ని ప్రమాదం సంభవించినట్లు థియేటర్ నిర్వాహకులు తెలిపారు. వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది థియేటర్ వద్దకు చేరుకుని మంటలను అదుపు చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ