అమరావతి, 30 జూలై (హి.స.)
: ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారిన లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో మరొకరిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. కీలక నిందితుడు వరుణ్‌ను శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అదుపులోకి తీసుకున్నారు. A1గా ఉన్న కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి కలెక్షన్ గ్యాంగ్‌లో వరుణ్ (కీలక వ్యక్తిగా గుర్తించారు.
అయితే ఈ లిక్కర్ కేసు నమోదైన వెంటనే వరుణ్‌ను కొందరు కీలక వ్యక్తులు దేశంp దాటించారు. ఇప్పటికే వరుణ్‌పై విజయవాడ కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ అయింది. ఈ కేసుకు సంబంధించి వరుణ్ నుంచి సిట్ అధికారులు కీలక సమాచారం రాబట్టారు. ఇవాళ, రేపు మరికొన్ని ప్రాంతాల్లో సిట్ అధికారులు సోదాలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా లిక్కర్ స్కామ్ కేసులో ఎంపీ మిథున్ రెడ్డితో సహా మరో ఓ12 మందిని సిట్ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ