పోతుల చెంచయ్య వెస్ట్ కాలనీలో పోలీసులు నేడు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు
టంగుటూరు, 30 జూలై (హి.స.) : మండల కేంద్రంలోని పోతుల చెంచయ్య వెస్ట్ కాలనీలో బుధవారం పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, సింగరాయకొండ సీఐ చావా హజరత్తయ్య ఆధ్వర్యంలో ఈ తనిఖీలు నిర్వహించారు. వేకువజాము నుంచి కాలనీ వా
పోతుల చెంచయ్య వెస్ట్ కాలనీలో పోలీసులు నేడు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు


టంగుటూరు, 30 జూలై (హి.స.)

: మండల కేంద్రంలోని పోతుల చెంచయ్య వెస్ట్ కాలనీలో బుధవారం పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, సింగరాయకొండ సీఐ చావా హజరత్తయ్య ఆధ్వర్యంలో ఈ తనిఖీలు నిర్వహించారు. వేకువజాము నుంచి కాలనీ వాసులను బయటకు వెళ్లనివ్వకుండా పోలీసులు నిఘా పెట్టారు. కాలనీలో సుమారు 400 ఇళ్లను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. సరైన ధ్రువపత్రాలు లేని 25 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ కాలనీలో గుర్తు తెలియని వ్యక్తులు సంచరించినా, మత్తు పదార్థాలు విక్రయించినా పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దొంగతనాలు జరగకుండా స్థానికులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. విలువైన వస్తువులను బ్యాంకు లాకర్లలో భద్రపరుచుకోవాలని సూచనలు చేశారు. తనిఖీల్లో 72 మంది పోలీసు సిబ్బంది, 9 మంది ఎస్సైలు పాల్గొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande