తిరుమల శ్రీవారిని.పలువురు సినీప్రముఖులు దర్శించుకున్నారు
అమరావతి, 30 జూలై (హి.స.) తిరుమల: తిరుమల శ్రీవారిని పలువురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో నిర్మాత దిల్ రాజు, నటుడు అశోక్ కుమార్, కన్నడ సినీనటుడు పునీత్ రాజ్ కుమార్ సతీమణి అశ్వినీ పునీత్ రాజ్ కుమార్, గాలి జనార్ధన్‌ర
తిరుమల శ్రీవారిని.పలువురు సినీప్రముఖులు దర్శించుకున్నారు


అమరావతి, 30 జూలై (హి.స.)

తిరుమల: తిరుమల శ్రీవారిని పలువురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో నిర్మాత దిల్ రాజు, నటుడు అశోక్ కుమార్, కన్నడ సినీనటుడు పునీత్ రాజ్ కుమార్ సతీమణి అశ్వినీ పునీత్ రాజ్ కుమార్, గాలి జనార్ధన్‌రెడ్డి, ఆయన తనయుడు కిరీటి.. స్వామివారి సేవలో పాల్గొన్నారు. తితిదే అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయంలోకి వెళ్లిన ప్రముఖులు స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande