అనంతపురంలో 44 వ జాతీయ రహదారి పై. రోడ్డు ప్రమాదం
అమరావతి, 30 జూలై (హి.స.) అనంత నేరవార్తలు, అనంతపురం నగరంలోని 44వ జాతీయ రహదారిపై మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్‌కు కాళ్లు విరిగాయి. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన లారీ గోధుమ ధాన్యం బస్తాల లోడుతో బెంగుళూరుకు వెళ్తుండగా, స్థానిక కళ్యాణదుర్గం బ
అనంతపురంలో 44 వ జాతీయ రహదారి పై. రోడ్డు ప్రమాదం


అమరావతి, 30 జూలై (హి.స.)

అనంత నేరవార్తలు, అనంతపురం నగరంలోని 44వ జాతీయ రహదారిపై మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్‌కు కాళ్లు విరిగాయి. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన లారీ గోధుమ ధాన్యం బస్తాల లోడుతో బెంగుళూరుకు వెళ్తుండగా, స్థానిక కళ్యాణదుర్గం బైపాసు కూడలికి సమీపంలో హైవేపై ముందు వెళ్తున్న మరో లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌ మహమ్మద్‌ నుమాన్‌కు రెండు కాళ్లు విరిగాయి. లారీ ముందు భాగం నుజ్జు నుజ్జయింది. గమనించిన స్థానికులు గాయపడిన డ్రైవర్‌ను హుటాహుటిన ప్రభుత్వ సర్వజనాసుపత్రికి తరలించారు. రోడ్డు మధ్య భాగంలో ప్రమాదం జరగడంతో కాసేపు వాహనాలు ఎక్కడికక్కడే ఆగిపోయాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande