తిరుమల, 30 జూలై (హి.స.)
:శ్రీవాణి టిక్కెట్లపై( తిరుమల తిరుపతి దేవస్థానం)కీలక నిర్ణయం తీసుకుంది.శ్రీవాణి టిక్కెట్లకోటాను భారీగా పెంచింది. శ్రీవాణి టికెట్స్ కోసం భక్తుల నుంచి భారీగా డిమాండ్ నెలకొన్న నేపథ్యంలో టికెట్ల కోటాను పెంచాలని నిర్ణయించింది టీటీడీ. 1500 టిక్కెట్ల కోటాను 2వేల టికెట్లకు పెంచాలని నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రతి రోజు కరెంటు బుకింగ్ కోటా క్రింద తిరుమలలో 2వేల టిక్కెట్లు, రేణిగుంట విమానాశ్రయంలో 400 టిక్కెట్లు జారీ చేయాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ