లాభాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్ 144, నిఫ్టీ 34 పాయింట్ల లాభం
ముంబై, 30 జూలై (హి.స.) భారత్, అమెరికా ట్రేడ్ డీల్పై స్పష్టత రాకపోవడం దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాలతో ముగిశాయి. అదేవిధంగా అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు కూడా కాస్త ప్రభావం చూపాయి. ఈ క్రమంలో సెన్సెక్స్ 144 పాయింట్లకు పైగా లాభపడగా.
స్టాక్ మార్కెట్


ముంబై, 30 జూలై (హి.స.)

భారత్, అమెరికా ట్రేడ్ డీల్పై స్పష్టత

రాకపోవడం దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాలతో ముగిశాయి. అదేవిధంగా అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు కూడా కాస్త ప్రభావం చూపాయి. ఈ క్రమంలో సెన్సెక్స్ 144 పాయింట్లకు పైగా లాభపడగా.. నిఫ్టీ (NIFTY) 34 పాయింట్లు ఎగబాకి 24,855 వద్ద ముగిసింది. కాగా, సెన్సెక్స్ ఉదయం 81,481 పాయింట్ల లాభంతో ప్రారంభమై రోజంతా లాభాల్లోనే కొనసాగింది. డాలరుతో రూపాయి మారకం విలువ 87.43గా ఉంది.

ఇక న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ, రెఫెక్స్ ఇండస్ట్రీస్, సుమిటోమో కెమికల్స్, జుబిలాంట్ ఫార్మోవా, అవెన్యూ సూపర్ మార్కెట్స్, పెరల్ గ్లోబల్ ఇండస్ట్రీస్, ఎల్అండ్, సన్ఫార్మా, ఎన్టీపీసీ, మారుతీ సుజుకీ, భారతీ ఎయిర్టెల్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. అదేవిధంగా బిర్లా కార్పొరేషన్, రెడింగ్టన్, త్రివేణి ఇంజినీరాంగ్ అండ్ ఇండస్ట్రీస్, MOIL, ఫైవ్ స్టార్ బిజినెస్ ఫైనాన్స్, రిలయన్స్ పవర్, జెన్ టెక్నాజీస్, బ్లూడార్ట్ ఎక్స్ప్రెస్, హిందుస్థాన్ యూనిలీవర్, టాటా మోటార్స్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఎటెర్నల్, బజాజ్ ఫిన్సర్వ్ షేర్లు పతనమయ్యాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande