దక్షిణ కొరియా లో నిర్వహిస్తున్న 20 వ ఆసియన్. రోలర్ స్కేటింగ్ లో. భారత యువ ప్రతిభ
అమరావతి, 30 జూలై (హి.స.) చిలకలూరిపేట గ్రామీణ, దక్షిణ కొరియాలో నిర్వహిస్తున్న 20వ ఆసియన్‌ రోలర్‌ స్కేటింగ్‌ ఛాంపియన్‌షిప్‌ -2025లో భారత్‌ యువ ప్రతిభ మరోసారి మెరిసింది. హైదరాబాద్‌లో ఉంటున్న పడిగ తేజేష్‌ మూడు విభిన్న విభాగాల్లో పతకాలు సాధించి దేశానికి
దక్షిణ కొరియా లో నిర్వహిస్తున్న 20 వ ఆసియన్. రోలర్ స్కేటింగ్ లో. భారత యువ ప్రతిభ


అమరావతి, 30 జూలై (హి.స.)

చిలకలూరిపేట గ్రామీణ, దక్షిణ కొరియాలో నిర్వహిస్తున్న 20వ ఆసియన్‌ రోలర్‌ స్కేటింగ్‌ ఛాంపియన్‌షిప్‌ -2025లో భారత్‌ యువ ప్రతిభ మరోసారి మెరిసింది. హైదరాబాద్‌లో ఉంటున్న పడిగ తేజేష్‌ మూడు విభిన్న విభాగాల్లో పతకాలు సాధించి దేశానికి గర్వకారణంగా నిలిచాడు. జులై 24 నుంచి 30 వరకు నిర్వహిస్తున్న ఈ ప్రతిష్టాత్మక ఛాంపియన్‌షిప్‌లో తేజేష్‌ పెయిర్‌ స్కేటింగ్‌ విభాగంలో రజత పతకం, క్వార్టెట్‌ స్కేటింగ్‌లో మరో రజత పతకం, షోగ్రూప్‌ స్కేటింగ్‌లో అద్భుత ప్రదర్శనతో బంగారు పతకాలను సాధించాడు. ఈ విజయాలతో తెలుగు యువ కెరటం అంతర్జాతీయ వేదికపై మెరిసింది. తేజేష్‌ తల్లిదండ్రులు బాల సుబ్రహ్మణ్యం, సౌమిలది చిలకలూరిపేట మండలంలోని మురికిపూడి. తేజేష్‌కు చిన్నతనంలోనే స్కేటింగ్‌పై ఉన్న మక్కువ గుర్తించి ప్రత్యేక శిక్షణ ఇప్పించారు. మెరుగైన శిక్షణకు హైదరాబాద్‌లో ఉంటున్నారు. 19వ ఏషియన్‌ స్కేటింగ్‌ పోటీల్లో రజత పతకం సాధించాడు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande