ఉరకలెత్తుతున్న కృష్ణమ్మ .. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 3 లక్షల క్యూసెక్కుల వరద నీరు దిగువకు
శ్రీశైలం , 30 జూలై (హి.స.)కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కృష్ణా నది పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తోంది. సుంకేశుల, జూరాల నుంచి శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఈ ప్రాజెక్టుల నుంచి శ్రీశైలం జలాశయానికి 2
శ్రీశైలం


శ్రీశైలం , 30 జూలై (హి.స.)కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కృష్ణా నది పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తోంది. సుంకేశుల, జూరాల నుంచి శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఈ ప్రాజెక్టుల నుంచి శ్రీశైలం జలాశయానికి 2,89,670 క్యూసెక్కుల వరద నీరు చేరుతోంది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయం నుంచి 3,02,478 క్యూసెక్కుల నీరు విడుదల అవుతోంది.

8 స్పిల్ వే గేట్ల ద్వారా 2,16,520 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా 20 వేల క్యూసెక్కులు, ఎడమ గట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315 క్యూసెక్కులు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 30,643 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 882.80 అడుగులకు నీటిమట్టం చేరింది. ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 203.42 టీఎంసీలుగా నీటి నిల్వ నమోదైంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande