అమరావతి, 31 జూలై (హి.స.)
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మరోసారి మంచి మనసు చాటుకున్నారు. సాలూరు నియోజకవర్గ పరిధిలో ఏజెన్సీ గ్రామాలైన చిలక మెండంగి, తాడిప్యూట్టి, బెండ మెండింగి, డోయువరా బాగుజోల, సిరివర గ్రామాల్లో 222 కుటుంబాలకు రగ్గులు పంపారు. డిప్యూటీ సీఎం పంపిన రగ్గులను అందుకున్న గిరిజన మహిళలు ఆనందం వ్యక్తం చేశారు. ఇందుకు సంబందించిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ