నర్సీపట్నం, 31 జూలై (హి.స.)
పోలీసు స్టేషన్‌లోనే ఇద్దరు కానిస్టేబుళ్లపై కత్తులతో ఓ యువకుడు దాడికి ప్రయత్నించడం కలకలం సృష్టించింది. సీఐ గోవిందరావు కథనం ప్రకారం.. పెదబొడ్డేపల్లి కాపువీధికి చెందిన కాళ్ల మణికంఠ మంగళవారం పెదబొడ్డేపల్లి కూడలిలో ట్రాఫిక్ సిబ్బందితో గొడవపడి రాయితో దాడికి యత్నించాడు. అనంతరం రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో స్టేషన్‌లో గొడవపడి హఠాత్తుగా రెండు జేబుల్లో నుంచి రెండు కత్తులు బయటకు తీసి ఇద్దరు కానిస్టేబుళ్లపై దాడికి ప్రయత్నించాడు. ఇతని నుంచి కత్తులు స్వాధీనం చేసుకుని బుధవారం కోర్టులో హాజరుపరిచినట్టు సీఐ వివరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ