అమరావతి, 31 జూలై (హి.స.)వైఎస్సాఆర్సీపీ(YSRCP) అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(YS Jagan Mohan Reddy) ఈ రోజు నెల్లూరు పర్యటన షెడ్యూలు(Nellore tour schedule) విడుదల అయింది. ఈ రోజు గురువారం ఉదయం తాడేపల్లి నుంచి బయల్దేరి నెల్లూరు చేరుకుంటారు. నెల్లూరు సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి(Kakani Govardhan Reddy)తో జగన్ ములాఖత్ అవుతారు. అనంతరం కాకాణి కుటుంబ సభ్యులను కలిసి, వారితో మాట్లాడతారు.
ఆ తర్వాత నెల్లూరు పట్టణంలోనే నివాసం ఉంటున్న నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ ను కలిసి మాట్లాడతారు. తర్వాత జగన్ అక్కడి నుంచి బయల్దేరి తాడేపల్లికి చేరుకుంటారు. అయితే జైల్లో ఉన్న కాకాణిని కలిసిన అనంతరం జిల్లా నాయకులతో జగన్ సమావేశం అవుతారని సమాచారం. ఎలాంటి సమావేశాలకు పోలీసుల అనుమతి లేనప్పటికీ, ప్రసన్న కుమార్ ఇంట్లో ఈ భేటీ జరిగే అవకాశం ఉందని వైసీపీ వర్గాల ఇన్ఫర్మేషన్.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి