తిరుమల, 11 ఆగస్టు (హి.స.)
: తిరుమల తిరుపతి దేవస్థానానికి బెంగళూరుకు చెందిన భక్తుడు రూ. 20 లక్షల విరాళాన్ని అందించారు. బెంగుళూరుకు చెందిన చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ సొసైటీ ప్రెసిడెంట్ ఎస్ఎన్‌వీఎల్ నరసింహ రాజు తితిదే ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.10 లక్షలు, ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు రూ.10 లక్షలు చొప్పున విరాళంగా ప్రకటించారు. ఈ మేరకు నరసింహరాజు ప్రతినిధి మోహన్ కుమార్ రెడ్డి తితిదే అదనపు ఈవో సీహెచ్.వెంకయ్య చౌదరికి విరాళానికి సంబంధించిన చెక్కును అందజేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ