తిరుపతి, 12 ఆగస్టు (హి.స.)
: తిరుపతి నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, అందరూ ఆ దిశగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ పిలుపునిచ్చారు. ‘హర్ ఘర్ తిరంగ’ కార్యక్రమంలో భాగంగా మంగళవారం తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్, టూరిజం, ఎస్వీ యునివర్సిటీ సంయుక్తంగా మహతి ఆడిటోరియం నుంచి ఎస్వీ యూనివర్సిటీ స్టేడియం వరకు వెయ్యి అడుగుల భారీ జాతీయ జెండాతో విద్యార్థులతో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ వెయ్యి అడుగుల త్రివర్ణ పతాక ప్రదర్శనను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్, కమిషనర్ ఎన్.మౌర్య జెండా ఊపి ప్రారంభించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ