అమరావతి, 12 ఆగస్టు (హి.స.)
పులివెందుల: వైఎస్‌ఆర్ కడప జిల్లా పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్ ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు క్యూలైన్లలో ఉన్నవారిని ఓటు హక్కు వినియోగించుకునేందుకు అధికారులు అనుమతిస్తున్నారు. రెండు చోట్లా 11 మంది చొప్పున అభ్యర్థులు బరిలో నిలిచారు.
ఈ ఎన్నికల్లో ప్రధాన పోరు తెదేపా, వైకాపా మధ్యే జరిగింది. పులివెందులలో తెదేపా అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి, వైకాపా అభ్యర్థి హేమంత్‌రెడ్డి.. ఒంటిమిట్టలో ముద్దు కృష్ణారెడ్డి (తెదేపా), ఇరగం రెడ్డి (వైకాపా) తలపడ్డారు. పులివెందులలో 15, ఒంటిమిట్టలో 30 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ నిర్వహించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ