ప్రభుత్వ విభాగాల్లో భర్తీకి ఏపీ పీ ఎస్సీ మరి. 3 నోటిఫికేషన్లు.విడుదల
అమరావతి, 12 ఆగస్టు (హి.స.) : ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి ఎపీపీఎస్సీ మరో 3 నోటిఫికేషన్లు విడుదల చేసింది. వ్యవసాయ శాఖలో 10 అగ్రికల్చర్ ఆఫీసర్ ఉద్యోగాల నియాకానికి నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ నెల 19 నుంచి సెప్టెంబర్ 8 వరకు దరఖాస్తులు చేసుకునే అవకాశ
Raghavendraswamy


అమరావతి, 12 ఆగస్టు (హి.స.)

: ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి ఎపీపీఎస్సీ మరో 3 నోటిఫికేషన్లు విడుదల చేసింది. వ్యవసాయ శాఖలో 10 అగ్రికల్చర్ ఆఫీసర్ ఉద్యోగాల నియాకానికి నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ నెల 19 నుంచి సెప్టెంబర్ 8 వరకు దరఖాస్తులు చేసుకునే అవకాశం ఉంది.

అటు, దేవాదాయ శాఖలో 7 ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువరించింది. ఈ నెల 13 నుంచి సెప్టెంబర్ 2 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది.

ఇక, భూగర్భజల శాఖలో 4 టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి కూడా ఎపీపీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ నెల 13 నుంచి సెప్టెంబర్ 2 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.

ఎపీపీఎస్సీ వెబ్ సైట్లో జాబ్ నోటిఫికేషన్లను పొందుపరచామని ఎపీపీఎస్సీ కార్యదర్శి పి. రాజాబాబు తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande