ORRపై ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు పారిశుధ్య కార్మికులు దుర్మరణం
హైదరాబాద్, 11 ఆగస్టు (హి.స.) మేడ్చల్ పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్ పై సోమవారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విధులలో భాగంగా చెట్లకు నీళ్లు పెడుతున్న పారిశుధ్య కార్మికులను గుర్తు తెలియని వాహనం బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు కార్మికులు
Orr ప్రమాదం


హైదరాబాద్, 11 ఆగస్టు (హి.స.)

మేడ్చల్ పరిధిలోని ఔటర్ రింగ్

రోడ్ పై సోమవారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విధులలో భాగంగా చెట్లకు నీళ్లు పెడుతున్న పారిశుధ్య కార్మికులను గుర్తు తెలియని వాహనం బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికుల సమాచారంతో విషయం తెలిసిన వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. కాగా దుర్మరణం పాలైన మృతులది ఒడిశా రాష్ట్రంగా గుర్తించారు. డెడ్బాడీలను దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande