హైదరాబాద్, 11 ఆగస్టు (హి.స.)
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ
హైకోర్టులో భారీ ఊరట లభించింది. 2019 అక్టోబర్ నెలలో సూర్యాపేట జిల్లా గరిడేపల్లి పోలీస్ స్టేషన్లో ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని పోలీసులు నాడు రేవంత్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. అయితే, ఆ కేసును కొట్టివేయాలని ఇటీవలే ఆయన హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు రేవంత్ రెడ్డి పిటిషన్పై పలుమార్లు విచారణ చేపట్టిన ధర్మాసనం ఇవాళ తుది తీర్పును వెలువరించింది. ఇరు పక్షాల వాదనలు విని గరిడేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసును కొట్టివేస్తున్నట్లుగా ప్రకటించింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..