హైదరాబాద్, 11 ఆగస్టు (హి.స.)
సివిల్స్ కు సన్నద్ధమయ్యే వారికి ఎంతో కొంత సాయం చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. హైదరాబాద్ లోని ప్రజాభవన్లో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో 'రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం' పథకం కింద సివిల్స్-2025లో మెయిన్స్ కు ఎంపికైన అభ్యర్థులకు రూ. లక్ష చెక్కులను మంత్రి కోమటిరెడ్డితో కలిసి ఆయన పంపిణీ చేశారు. సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో సివిల్స్-2024 విజేతలకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పథకం ద్వారా అభ్యర్థులకు సాయం అందిస్తామన్నారు. ఈ పథకాన్ని విజయవంతంగా రెండో సంవత్సరం అమలుచేస్తున్నామన్నారు. సివిల్స్ అభ్యర్థులు పరీక్షలకు సిద్ధమయ్యందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్నివిధాలా సాయం అందించడానికి సిద్ధంగా ఉందని చెప్పారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్