మంత్రి కొండా సురేఖ ఇంటి వద్ద ఉద్రిక్తత..
తెలంగాణ, వరంగల్. 11 ఆగస్టు (హి.స.) హనుమకొండలోని రామ్ నగర్ లో మంత్రి కొండా సురేఖ ఇంటి వద్ద సోమవారం ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. తమకు జీవనోపాధి అయిన మధ్యాహ్న భోజన పథకాన్ని అక్షయ పాత్రకు ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారని, ఎట్టి పరిస్థితుల్లోనూ మధ్య
మంత్రి సురేఖ


తెలంగాణ, వరంగల్. 11 ఆగస్టు (హి.స.)

హనుమకొండలోని రామ్ నగర్

లో మంత్రి కొండా సురేఖ ఇంటి వద్ద సోమవారం ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. తమకు జీవనోపాధి అయిన మధ్యాహ్న భోజన పథకాన్ని అక్షయ పాత్రకు ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారని, ఎట్టి పరిస్థితుల్లోనూ మధ్యాహ్న భోజన పథకాన్ని అక్షయపాత్రకు ఇవ్వద్దని, అట్టి ప్రతిపాదనను వెంటనే విరమించుకోవాలని సంబంధిత కార్మికులు, నాయకులు నేడు మంత్రి కొండ సురేఖ ఇంటిని ముట్టడించారు. వెంటనే కార్మికుల సమస్యలను పరిష్కరించాలని మంత్రి కొండా సురేఖకు వ్యతిరేకంగా వారు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ క్రమంలోనే మంత్రి ఇంట్లోకి చొరబడే ప్రయత్నం చేయగా సుబేదారి పోలీసులు వారిని అడ్డుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande