ఉద్యోగుల జీతాలపై స్పష్టత.. హైడ్రా కమిషనర్ భరోసా!
హైదరాబాద్, 11 ఆగస్టు (హి.స.) ఉద్యోగుల జీతాల అంశంపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టతనిచ్చారు. ఇటీవల జారీ చేసిన G.O ప్రకారం ఒక్క స్కేల్ జీతం విడుదల చేసినప్పటికీ, హైడ్రా లో పనిచేస్తున్న సిబ్బంది జీతాలు తగ్గే అవకాశం లేదని ఆయన స్పష్టం చేశారు. చిన్న కన్ఫ
హైడ్రా కమిషనర్


హైదరాబాద్, 11 ఆగస్టు (హి.స.)

ఉద్యోగుల జీతాల అంశంపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టతనిచ్చారు. ఇటీవల జారీ చేసిన G.O ప్రకారం ఒక్క స్కేల్ జీతం విడుదల చేసినప్పటికీ, హైడ్రా లో పనిచేస్తున్న సిబ్బంది జీతాలు తగ్గే అవకాశం లేదని ఆయన స్పష్టం చేశారు. చిన్న కన్ఫ్యూజన్ కారణంగా ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేసినప్పటికీ, ఆ అంశాన్ని తాము పూర్తిగా వివరించడంతో వారికి భరోసా కలిగిందని తెలిపారు. అలాగే మార్షల్స్ జీతాలు భవిష్యత్తులో ఇంకా పెరుగుతాయని కమిషనర్ స్పష్టం చేశారు.

మార్షల్స్ పట్ల ఏ అధికారి అమర్యాదగా ప్రవర్తించినా ఉపేక్షించబోమని కమిషనర్ హెచ్చరించారు. అలాంటి ఘటనలు జరిగితే నేరుగా తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. అలాగే, ఎక్కువ గంటలు పనిచేసే ఉద్యోగులకు ఓవర్ టైమ్ చెల్లింపులు చేయాలనే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande