హైడ్రాలోని మార్షల్స్ విధుల బహిష్కరణ.. సేవలకు తీవ్ర అంతరాయం
హైదరాబాద్, 11 ఆగస్టు (హి.స.) హైడ్రా మార్షల్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. దీంతో హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఎమర్జెన్సీ సేవలు నిలిచిపోయాయి. తమకు గతంలో ఇచ్చిన జీతాల్లో కోత విధిస్తున్నట్లు ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేయడం కారణంగానే విధులను బహిష
హైడ్రా


హైదరాబాద్, 11 ఆగస్టు (హి.స.)

హైడ్రా మార్షల్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. దీంతో హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఎమర్జెన్సీ సేవలు నిలిచిపోయాయి. తమకు గతంలో ఇచ్చిన జీతాల్లో కోత విధిస్తున్నట్లు ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేయడం కారణంగానే విధులను బహిష్కరిస్తున్నట్లు హైడ్రా మార్షల్స్ పేర్కొన్నారు. ఈ క్రమంలో ఎమర్జెన్సీ సేవలు నిలిచిపోవడంతో పాటు 51 హైడ్రా వాహనాలు ఆగిపోయాయి. హైదరాబాద్ నగరంలోని 150 డివిజన్లలో హైడ్రా సేవలకు అంతరాయం ఏర్పడింది.

నగరంలో విపత్తు నిర్వహణ, ఆస్తుల పరిరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇందులో చాలా వరకు మాజీ సైనిక ఉద్యోగులు సేవలందిస్తున్నారు. అయితే విధులను బహిష్కరించిన మార్షల్స్తో హైడ్రా కమిషనర్ చర్చలు జరిపినట్లు సమాచారం. పాత జీతాలే కంటిన్యూ చేస్తామని కమిషనర్ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. హైడ్రా ఉద్యోగులకు రూ.7000 జీతం తగ్గిస్తూ ఇటీవల ప్రభుత్వం జీవో విడుదల చేసింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande