నైపుణ్య అభివృద్ధి శాఖ ఈ నెల 14 న జాబ్.మేళా 11. కంపెనీలలో .500 ఖాళీలు భర్తీ
అమరావతి, 11 ఆగస్టు (హి.స.) క‌ర్నూలు: నైపుణ్య, అభివృద్ధి, శిక్షణ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 14న ఏర్పాటు చేయనున్న జాబ్ మేళా పోస్టర్లను జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా, జాయింట్ కలెక్టర్ డా.బి.నవ్యతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ
నైపుణ్య అభివృద్ధి శాఖ ఈ నెల 14 న జాబ్.మేళా 11. కంపెనీలలో .500 ఖాళీలు భర్తీ


అమరావతి, 11 ఆగస్టు (హి.స.)

క‌ర్నూలు: నైపుణ్య, అభివృద్ధి, శిక్షణ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 14న ఏర్పాటు చేయనున్న జాబ్ మేళా పోస్టర్లను జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా, జాయింట్ కలెక్టర్ డా.బి.నవ్యతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. నైపుణ్య అభివృద్ధి, శిక్షణ శాఖ ఆధ్వర్యంలో 11 ప్రైవేటు కంపెనీల్లో ఉన్న 500 ఖాళీలను భర్తీ చేసేందుకు జిల్లాలోని ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు చెప్పారు. ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జాబ్ మేళా నిర్వహిస్తామన్నారు. 18 ఏళ్ల నుంచి 35 ఏళ్లలోపు వయసు, పదో తరగతి నుంచి డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, బీటెక్, పీజీ చదివిన వారు అర్హులన్నారు. ముందుగా ఈ.నెల 14 న వెబ్‌సైట్‌లో వివరాలు నమోదు చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపారు. జాబ్ మేళాను యువత పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలన్నారు. ఇందుకు సంబంధించి ఎటువంటి సందేహాలు ఉన్నా 7780478910, 9059290821నంబర్లను సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో డీఆర్వో సి.వెంకట నారాయణమ్మ , జిల్లా ఉపాధి కల్పన అధికారిణి దీప్తి, నైపుణ్య అభివృద్ధి శిక్షణ అధికారి రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande