ఆరు గ్యారెంటీల కాంగ్రెస్ హామీ.. ఆర్థిక రంగానికి నష్టం చేసింది : కేటీఆర్
హైదరాబాద్, 11 ఆగస్టు (హి.స.) రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాగ్ క్వార్టర్లీ రిపోర్టుపై కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. కాగ్ త్రైమాసిక నివేదిక ప్రకారం రాష్ట్ర
Ktr


హైదరాబాద్, 11 ఆగస్టు (హి.స.) రాష్ట్రంలో అధికారంలో ఉన్న

కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాగ్ క్వార్టర్లీ రిపోర్టుపై కేటీఆర్ తీవ్రంగా స్పందించారు.

కాగ్ త్రైమాసిక నివేదిక ప్రకారం రాష్ట్ర ఆదాయం బాగా తగ్గింది అని కేటీఆర్ పేర్కొన్నారు. రాష్ట్ర ఆదాయం తగ్గడం ప్రమాద ఘంటికలను మోగిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యంతో ఆర్థిక రంగం దెబ్బతింటోంది. ఆరు గ్యారెంటీల కాంగ్రెస్ హామీ.. ఆర్థిక రంగానికి నష్టం చేసింది. రాష్ట్ర ఆదాయం తగ్గుతుంటే.. అప్పులు మాత్రం పెరుగుతున్నాయి. రూ.2,738 కోట్ల మిగులు ఉంటుందని బడ్జెట్లో చూపారు. మొదటి త్రైమాసికానికే రూ. 10,583 కోట్ల రెవెన్యూ లోటు ఉంది. మూడు నెలల్లోనే రూ. 20,266 కోట్లు అప్పుగా తీసుకున్నారు. ఒక్క రోడ్డు వేయలేదు.. ఒక్క కొత్త ప్రాజెక్టు కట్టలేదు. ఆర్థిక రంగాన్ని ఎలా గాడిన పెడుతారో కాంగ్రెస్ ఆర్థిక నిపుణులు చెప్పగలరా..? అని కేటీఆర్ నిలదీశారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande