డిప్యూటీ సీఎంకు ధన్యవాదాలు.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి!
హైదరాబాద్, 11 ఆగస్టు (హి.స.) మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇటీవలి కాలంలో నిత్యం వార్తల్లో ఉంటున్నారు. సంచలన వ్యాఖ్యలు, ట్వీట్స్ చేస్తూ సొంత పార్టీ నేతలనే టార్గెట్ చేస్తున్నారు. తనకు మంత్రి పదవి ఇస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార
ఎమ్మెల్యే కోమటిరెడ్డి


హైదరాబాద్, 11 ఆగస్టు (హి.స.)

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇటీవలి కాలంలో నిత్యం వార్తల్లో ఉంటున్నారు. సంచలన వ్యాఖ్యలు, ట్వీట్స్ చేస్తూ సొంత పార్టీ నేతలనే టార్గెట్ చేస్తున్నారు. తనకు మంత్రి పదవి ఇస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హామీ ఇచ్చారని, ఇది ముమ్మాటికీ వాస్తవమని నేడు వారు పేర్కొన్నారు. అసలు వాస్తవాన్ని ప్రజలకు వివరించిన భట్టి విక్రమార్కకు రాజగోపాల్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.

'కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నాకు మంత్రి పదవి ఇస్తామన్న హామీని అమలు చేయకుండా రాష్ట్ర ముఖ్య నేతలు అడ్డుకుంటూ, అవమానిస్తున్న వాస్తవాన్ని మీడియా ద్వారా ప్రజలకు వివరించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ధన్యవాదాలు. నాకు మంత్రి పదవి ముఖ్యం కాదు. ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ సర్కారు అమలు చేయాలని, అవినీతి రహిత పాలన అందించాలని కోరుతున్నా. తెలంగాణ సమాజ ఆకాంక్షలను నెరవేర్చేలా కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ఉండాలని ఆశిస్తున్నా' అని ఎమ్మెల్యే కోమటిరెడ్డి ట్వీట్ చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande