గురుకుల విద్యార్థులకు దొడ్డు బియ్యంతో భోజనం.. అవాక్కైన మంత్రి అడ్లూరి
తెలంగాణ, కరీంనగర్. 11 ఆగస్టు (హి.స.) ''గురుకుల విద్యార్థులకు సన్నబియ్యంతో ఉండిన భోజనం వడ్డించాలని ఉత్తర్వులు విడుదల చేస్తే, ఇక్కడేంటి దొడ్డు బియ్యంతో భోజనం వడ్డిస్తున్నారు. సన్న బియ్యం ఏమయ్యాయి? అంటూ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్డూరి లక్ష్మణ్ క
మంత్రి అడ్లూరి


తెలంగాణ, కరీంనగర్. 11 ఆగస్టు (హి.స.)

'గురుకుల విద్యార్థులకు సన్నబియ్యంతో ఉండిన భోజనం వడ్డించాలని ఉత్తర్వులు విడుదల చేస్తే, ఇక్కడేంటి దొడ్డు బియ్యంతో భోజనం వడ్డిస్తున్నారు. సన్న బియ్యం ఏమయ్యాయి? అంటూ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్ అధికారులపై మండిపడ్డారు.

జిల్లా పర్యటనలో భాగంగా సోమవారం మధ్యాహ్నం కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలంలోని చింతకుంట సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాలలో మంత్రి ఆకస్మిక తనిఖీ చేశారు. ఈసందర్భంగ విద్యార్థుల కోసం వండిన వంటలు పరిశీలించారు. దొడ్డు బియ్యంతో వండిన భోజనం విద్యార్థులకు వడ్డిస్తుండటానికి గమనించి అవాక్కయ్యారు.

సన్న బియ్యం భోజనం అందించాల్సి ఉండంగా ఇదేంటి ఇలాంటి భోజనం వడ్డిస్తున్నారు అంటూ సంబంధిత అధికారులను ప్రశ్నించగా, దొడ్డు బియ్యమే సరఫరా అవుతున్నాయంటూ అధికారులు సమాధానం ఇచ్చారు. వెంటనే బియ్యం భద్రపరిచిన గదిలోకి వెళ్లి తనిఖీ చేయగా అన్ని బస్తాల్లో దొడ్డు బియ్యం దర్శనమిచ్చాయి. దీంతో ఈ బియ్యం రిటర్న్ పంపించాలని వీటి స్థానంలో సన్న బియ్యం పంపించాలంటూ ఆదేశించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande