బీసీల రిజర్వేషన్స్ పై బిజెపికి చిత్త శుద్ధి లేదు: మంత్రి శ్రీధర్ బాబు
తెలంగాణ, కరీంనగర్. 11 ఆగస్టు (హి.స.) బీసీల రిజర్వేషన్కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న మేరకు శాసనసభలో చట్టాన్ని ప్రవేశపెట్టి ఆర్డినేషన్ తీసుకువచ్చామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. సోమవారం కరీంనగర్లో సుడా కార్యాలయ భవన నిర్మాణానికి వారు భూమి
మంత్రి శ్రీధర్ బాబు


తెలంగాణ, కరీంనగర్. 11 ఆగస్టు (హి.స.)

బీసీల రిజర్వేషన్కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న మేరకు శాసనసభలో చట్టాన్ని ప్రవేశపెట్టి ఆర్డినేషన్ తీసుకువచ్చామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. సోమవారం కరీంనగర్లో సుడా కార్యాలయ భవన నిర్మాణానికి వారు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర బాబు విలేకరులతో మాట్లాడుతూ.. బీసీల రిజర్వేషన్ పై రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఆర్డినెన్స్ ఆమోదించాల్సింది కేంద్ర ప్రభుత్వమేనని పేర్కొన్నారు.

బీజేపీ ఎంపీలకు చిత్తశుద్ధి ఉంటే ఆర్డినెన్స్ ఆమోదింప చేయాలని పేర్కొన్నారు. మేడిగడ్డ విషయంలో డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన సూచనలు మాత్రమే ప్రభుత్వం పాటించి ముందుకు సాగుతుందన్నారు. పదేళ్ల నుంచి బిజెపి ప్రభుత్వం అధికారంలో ఉండి ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఏం సాధించిందని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ మంత్రి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యేలు సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande