రూ.3 కోట్లతో అచ్చంపేటలో సరికొత్త మున్సిపల్ భవనం.. ప్రారంభించిన మంత్రి వివేక్..
తెలంగాణ, నాగర్ కర్నూల్. 11 ఆగస్టు (హి.స.) నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట పట్టణంలోని నూతన మున్సిపల్ కార్యాలయానికి గత ప్రభుత్వంలో మూడు కోట్ల నిధులు కేటాయించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ చొరవ తీసుకొని నూతన
మంత్రి వివేక్


తెలంగాణ, నాగర్ కర్నూల్. 11 ఆగస్టు (హి.స.)

నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట

పట్టణంలోని నూతన మున్సిపల్ కార్యాలయానికి గత ప్రభుత్వంలో మూడు కోట్ల నిధులు కేటాయించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ చొరవ తీసుకొని నూతన మున్సిపల్ కార్యాలయాన్ని త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకున్నారు. సోమవారం మూడు కోట్లతో నిర్మించిన నూతన మున్సిపల్ కార్యాలయాన్ని ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ, కూచుకుల రాజేశ్వర్ రెడ్డి, కలెక్టర్ తో కలిసి మంత్రి వివేక వెంకటస్వామి ప్రారంభించారు. ఈ మేరకు మంత్రికి బోనాలతో స్వాగతం పలికారు. అనంతరం బల్మూరు మండలంలోని కొండనాగుల గ్రామంలో సీసీ రోడ్ల ప్రారంభంతో పాటు అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande