ప్రజావాణికి అధికారుల డుమ్మా.. అసహనం వ్యక్తం చేసిన జిల్లా కలెక్టర్
తెలంగాణ, నిజామాబాద్. 11 ఆగస్టు (హి.స.) ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతీ సోమవారం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖలకు చెందిన జిల్లా అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ టీ వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించార
జిల్లా కలెక్టర్


తెలంగాణ, నిజామాబాద్. 11 ఆగస్టు (హి.స.)

ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతీ సోమవారం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖలకు చెందిన జిల్లా అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ టీ వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో జిల్లా స్థాయి అధికారులు డుమ్మా కొట్టడంతో కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. కలెక్టరేట్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ఆయన అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్ తో కలిసి ఫిర్యాదులు స్వీకరించారు.

ప్రజావాణిలో 83 ఫిర్యాదులు అందగా సంబంధిత శాఖ అధికారులను ఫిర్యాదులు పరిశీలించి త్వరితగతన సమస్యను తీర్చాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ప్రజావాణి కార్యక్రమానికి పలువురు జిల్లా అధికారులు రాకపోవడం గమనించిన కలెక్టర్ ఒకింత అసహనం వ్యక్తం చేస్తూ ప్రజావాణి కార్యక్రమానికి ఉన్న ప్రాముఖ్యతను అధికారులు గుర్తించాలని ఎంతో ప్రాముఖ్యత ఉన్న కార్యక్రమానికి కిందిస్థాయి అధికారులు, సిబ్బందిని పంపించవద్దని, జిల్లా అధికారులే స్వయంగా ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొనాలని స్పష్టం చేశారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande