తెలంగాణ, పెద్దపల్లి. 11 ఆగస్టు (హి.స.)
ప్రజావాణి అర్జీలకు ప్రాధాన్యతనిచ్చి సమస్యలను పరిష్కరించాలని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ ప్రజల వద్ద నుండి దరఖాస్తులు స్వీకరించారు.
దరఖాస్తులో పేర్కొన్న సమస్యను అర్జీదారులను అడిగి తెలుసుకోని, సంబంధిత అధికారులకు సిఫార్సు చేశారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రజావాణి దరఖాస్తులను పెండింగ్ పెట్టకుండా ఎప్పటికప్పుడు సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు