అమరావతి, 11 ఆగస్టు (హి.స.)
: ఏపీ మద్యం కుంభకోణం l కేసులో సిట్ అదనపు ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. 200 పేజీలతో కూడిన ఛార్జ్‌షీట్‌ను విజయవాడలోని ఏసీబీ కోర్టుకు సిట్ అధికారులు సమర్పించారు. నిందితులు ధనుంజయరెడ్డి (ఏ 31), కృష్ణమోహన్‌రెడ్డి (ఏ 32), గోవిందప్ప బాలాజీ (ఏ 33) ప్రమేయం, నగదు తరలింపు అంశాలను దీనిలో సిట్ పేర్కొన్నట్లు సమాచారం. ప్రధాన నిందితుడు కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డితో వీరికి గల సంబంధాలు, నగదును అంతిమ లబ్ధిదారుకు చేర్చిన విధానాన్ని ఛార్జ్‌షీట్‌లో సిట్ ప్రస్తావించినట్లు తెలుస్తోంది.
మద్యం కుంభకోణం కేసులో గత నెల 19న సిట్ అధికారులు ప్రాథమిక ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేశారు. అందులో ఉన్న 9 సంస్థలు, ఏడుగురు వ్యక్తులపై అభియోగాలు మోపింది. ఇప్పుడు దానికి అనుబంధంగా మరో ఛార్జ్‌షీట్‌ను సిట్ దాఖలు చేసింది. ఈ కేసులో ఇప్పటివరకు 19 సంస్థలు, 29 మంది వ్యక్తులు నిందితులుగా ఉన్నారు. రాజ్ కెసిరెడ్డి (ఏ1), బూనేటి చాణక్య (ఏ-8), పైలా దిలీప్ (ఏ-30), సజ్జల శ్రీధర్‌రెడ్డి (ఏ-6), కె.ధనుంజయరెడ్డి (ఏ-31), పి.కృష్ణమోహన్‌రెడ్డి (ఏ-32), గోవిందప్ప బాలాజీ (ఏ-33), సీహెచ్.వెంకటేశ్‌నాయుడు (ఏ-34), చెవిరెడ్డి భాస్కరరెడ్డి (ఏ-38), పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి (ఏ-4), బాలాజీ కుమార్ యాదవ్ (ఏ-35), ఈ.నవీన్ కృష్ణ (ఏ-36) సహా మొత్తం 12 మంది అరెస్టయ్యారు. కేసు దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. అది పూర్తయ్యాక ఇంకో అనుబంధ ఛార్జ్‌షీట్‌ను సిట్ అధికారులు దాఖలు చేయనున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ