ఈరన్న స్వామికి ప్రత్యేక పూజలు
కౌతాళం,, 11 ఆగస్టు (హి.స.) : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఉరు కుంద ఈరన్న స్వామి దేవాలయానికి భక్తులు భారీ గా తరలి వస్తున్నారు. ముఖ్యంగా శ్రావణ మాసంలో మూడో సోమ వారం స్వామి దర్శనానికి ఆంధ్ర, కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్ర నుం చి భారీగా భక్తులు తరలివస్తున్
ఈరన్న స్వామికి ప్రత్యేక పూజలు


కౌతాళం,, 11 ఆగస్టు (హి.స.) : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఉరు కుంద ఈరన్న స్వామి దేవాలయానికి భక్తులు భారీ గా తరలి వస్తున్నారు.

ముఖ్యంగా శ్రావణ మాసంలో మూడో సోమ వారం స్వామి దర్శనానికి ఆంధ్ర, కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్ర నుం చి భారీగా భక్తులు తరలివస్తున్నారు. ఆదివారం మధ్యాహ్నం నుంచే వివిధ వాహనాల్లో భక్తులు కుటుంబ సమేతంగా తరలి వస్తున్నారు.

మూడో సోమవారం ఒక్కరోజు దాదాపు రూ.2 నుంచి రూ.3 లక్షల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకుంటారన్న అంచనా ఉండడంతో ఆలయ అధికారులు భక్తులకు తగిన సౌకర్యాలను కల్పించ డంలో నిమగ్నమయ్యారు. భక్తుల రాకతో ఆలయ ప్రాంగణం భక్తులతో నిండిపోయింది. మరి కొంత మంది భక్తులు స్వామి సన్నిధిలోనే నైవేద్యాలను తయారు చేసి స్వామి వారి సమర్పిస్తూ మొక్కులు తీర్చుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కౌతాళం సీఐ అశోక్‌ కుమార్‌ పటిష్ట బందోబస్తు చేపడుతున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande