సీఎం రేవంత్ రెడ్డితో పీసీసీ చీఫ్ భేటీ..స్థానిక ఎన్నికలపై బిగ్ డెసిషన్ !..
హైదరాబాద్, 11 ఆగస్టు (హి.స.) సీఎం రేవంత్ రెడ్డి తో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నేడు భేటీ అయ్యారు. జూబ్లీహిల్స్ సీఎం నివాసంలో సమావేశమై ఢిల్లీలో బీసీ ధర్నా తర్వాత పరిణామాలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ల అమలు కోసం చేయాల్సిన తదుపరి
పీసీసీ చీఫ్


హైదరాబాద్, 11 ఆగస్టు (హి.స.)

సీఎం రేవంత్ రెడ్డి తో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నేడు భేటీ అయ్యారు. జూబ్లీహిల్స్ సీఎం నివాసంలో సమావేశమై ఢిల్లీలో బీసీ ధర్నా తర్వాత పరిణామాలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ల అమలు కోసం చేయాల్సిన తదుపరి కార్యాచరణపై చర్చిస్తున్నట్లు సమాచారం. అలాగే టీపీసీసీ పీఏసీ సమావేశం తేదీ, ఎజెండా అంశాలతోపాటు పెండింగ్లో ఉన్న కార్పొరేషన్, బోర్డు, కమిషన్ డైరెక్టర్ల పోస్టుల నియామకలపై డిస్కస్ చేస్తున్నట్టు తెలుస్తోంది.

కాగా ఇటీవల ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద దీక్ష సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. త్వరలో టీపీసీసీ పీఏసీ సమావేశం నిర్వహించి బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande