అమరావతి, 11 ఆగస్టు (హి.స.)తెలుగు ఫిల్మ్ఛాంబర్అసోసియేషన్సభ్యులు ఈ రోజు ఏపీ రాజధానికి అమరావతికి వచ్చారు. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక , సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేశ్‌తో ఈ మధ్యాహ్నం వారు భేటీ కానున్నారు. ఏపీ సచివాలయంలో ఈ భేటీ జరుగనుంది. ముందుగా సినీ ప్రముఖులు నాగవంశీ, బన్నీ వాసు, పలువురు సినీ ప్రముఖులు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన ఏపీ సచివాలయానికి సినీ ప్రముఖులు బయ లుదేరి వెళ్లారు. సినీ కార్మికుల సమ్మె నేపథ్యంలో భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. ఈ సందర్భంగా నిర్మాత పీవీఎస్‌ఎన్ ప్రసాద్ ఓ మీడియా చానల్‌తో మాట్లాడుతూ సినీ పరిశ్రమ సమస్యలు అంటే తెలుగు రాష్ట్రాల సమస్య అని అన్నారు. అం దుకే ఏపీ ప్రభుత్వ సహకారం కోసం వచ్చామని తెలిపారు. పరిశ్రమలో అందరూ బాగుండాలని కోరుకుంటున్నామని తెలిపారు. తమిళనాడు నుంచి తెలంగాణకు వచ్చాం.. అలాగే తెలంగాణ నుంచి ఏపీకి వచ్చేలా చర్యలుతీసుకోవాలని కోరనున్నట్లు తెలిపారు. ఏపీలో ఇండస్ట్రీ అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం అన్నారు.
అయితే నిర్మాతలు విజవాడకు ఎందుకు వెళ్లారనే విషయం తెలియదని ఫిల్మ్ఫెడరేషన్అధ్యక్షుడు వల్లభనేని అనిల్ఓ మీడియా చానల్‌తో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం కార్మికులకు అనుకూలంగా ఉందన్నారు. ఇక్కడ చర్చలు జరప కుండా విజయవాడకు ఎందుకు వెళ్లారని ఆయన ప్రశ్నించారు. మంత్రి కోమటిరెడ్డిని కలిసి మా సమస్యలపై చర్చిస్తామని ఆయన తెలిపారు. మంత్రి సూచనల మేరకు నిర్ణయం తీసుకుని ముందుకెళ్తామన్నారు. మేం తెలంగాణ ప్రభుత్వానికి కట్టుబడి ఉన్నామని ఆయన చెప్పడం విశేషం. తాజా పరిణామాల నేపథ్యంలో ఏపీ మంత్రితో టాలీవుడ్ ప్రతినిధుల సమావేశం ఆసక్తి రేపుతోంది. వేతనాల పెంపు కోసం గతకొన్ని రోజులుగా సినీ కార్మికుల చేస్తున్న నిరసన షూటింగ్స్ బంద్ కు దారితీసింది. ఫెడరేషన్‌కు సహకరించకుండా షూటింగ్స్ బంద్ చేయాలని నిర్మాతలకు ఫిలిం ఛాంబర్ ఆదేశాలు జారీ చేసింది. దీంతో నేటి నుంచి అన్ని సినిమాల షూటింగ్స్ నిలిచిపోనున్నాయి. కాగ, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో ఈ మధ్యాహ్నం 3 గంటలకు సెక్రటేరియట్ లో ఫెడరేషన్ నేతలు, సినీ కార్మికులు సమావేశం కానున్నట్లు సమాచారం.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి