టీడీపీ నేత వీరయ్య చౌదరి హత్య కేసులో ప్రధాన నిందితుడికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
ఢిల్లీ, 11 ఆగస్టు (హి.స.): తెలుగుదేశం ఒంగోలు నేత వీరయ్య చౌదరి హత్య కేసులో (Veeraiah Chowdhury case) ప్రధాన నిందితుడికి సుప్రీంకోర్టు (Supreme Court) ముందస్తు బెయిల్ నిరాకరించింది. ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని సుప్రీంకోర్టులో ప్రధాన నిందితుడు ముప్పా
టీడీపీ నేత వీరయ్య చౌదరి హత్య కేసులో ప్రధాన నిందితుడికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ


ఢిల్లీ, 11 ఆగస్టు (హి.స.): తెలుగుదేశం ఒంగోలు నేత వీరయ్య చౌదరి హత్య కేసులో (Veeraiah Chowdhury case) ప్రధాన నిందితుడికి సుప్రీంకోర్టు (Supreme Court) ముందస్తు బెయిల్ నిరాకరించింది. ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని సుప్రీంకోర్టులో ప్రధాన నిందితుడు ముప్పా సురేష్ బాబు పిటిషన్ దాఖలు చేశారు. సురేష్ బాబు దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ రాజేష్ బిందాల్, జస్టిస్ మన్మోహన్‌ల ధర్మాసనం విచారణ జరిపింది. నాగులుప్పలపాడులో పట్టపగలు వీరయ్య చౌదరిపై దాడి చేసి హత్య చేసిన ఘటనలో సురేష్ బాబు ప్రధాన నిందితుడుగా ఉన్నారు.

వీరయ్య చౌదరి హత్య కేసులో ఇప్పటికే తొమ్మిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడిగా ఉన్న సురేష్ బాబు పరారీలో ఉన్నట్లు గతంలో పోలీసులు చెప్పారు. ముందస్తు బెయిల్‌ కోసం పిటిషనర్‌కి అర్హత లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ కేసులో డబ్బులు చేతులు మారడం, ఫోన్ కాల్స్‌తో సహా తగినన్ని ఆధారాలు ఉన్నాయని ధర్మాసనం పేర్కొంది. ఈ కేసులో మిగిలిన నిందితులకు రెగ్యులర్ బెయిల్ వచ్చిందని పిటీషనర్ తరపు న్యాయవాది చెప్పగా కింది కోర్టులో బెయిల్ తెచ్చుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ముందస్తు బెయిల్ పిటిషన్‌కి అర్హత లేదని సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande