కడప, 12 ఆగస్టు (హి.స.)
జిల్లాలో రెండు జట్పీటీసీ ఉప ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి.. ఇటు పులివెందులతో పాటు అటు ఒంటిమిట్ట జడ్పీటీసీ కోసం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం అయ్యింది.. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది.. అయితే, తెల్లవారుజాము నుంచి టెన్షన్ వాతావరణం నెలకొంది.. కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డిని అరెస్ట్ చేశారు పోలీసులు.. అయితే, కార్యకర్తలు అడ్డుకోవడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.. పులివెందులలో అవినాష్‌రెడ్డిని అరెస్ట్ చేసి కడపకు తరలించారు పోలీసులు. ఇక, వేంపల్లిలో సతీష్‌రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు.. టీడీపీ ఎమ్మెల్సీ రామ్‌గోపాల్‌రెడ్డి అరెస్ట్‌కు ప్రయత్నం.. హౌస్ అరెస్ట్ చేసుకోవడానికి నాకు అభ్యంతరం లేదు.. ఎన్నికలు జరిగే గ్రామాలకు కూడా నేను వెళ్లనని తెలిపారు రామ్‌గోపాల్‌రెడ్డి..
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ