కడప, 12 ఆగస్టు (హి.స.)
: వైఎస్సార్ కడప జిల్లా పులివెందుల, ఒంటిమిట్టలో జడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఈ రెండు స్థానాల నుంచి తెదేపా, వైకాపా, కాంగ్రెస్ పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు 11 మంది కలిపి మొత్తం 22 మంది పోటీ పడుతున్నారు. సాయంత్రం 5 గంటల వరకు బ్యాలెట్ విధానంలో పోలింగ్ జరగనుంది. ఉద్రిక్తతలు చోటు చేసుకోకుండా ఇప్పటికే పలువురు నేతలను పోలీసులు గృహ నిర్బంధం చేశారు.
పులివెందుల జడ్పీటీసీ స్థానం పరిధిలోని 15 పోలింగ్ కేంద్రాల్లో 10,600 మంది.. ఒంటిమిట్ట పరిధిలోని 30 పోలింగ్ కేంద్రాల్లో 24వేల మంది ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. రెండు మండలాల్లో పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. పులివెందుల, ఒంటిమిట్ట సరిహద్దు, జిల్లా సరిహద్దులో ప్రత్యేక చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. పులివెందులలో బందోబస్తును కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ పర్యవేక్షిస్తున్నారు. పోలింగ్ పూర్తయ్యే వరకు స్థానికేతరులు ఉండకూడదని పోలీసులు హెచ్చరించారు
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ