తెలంగాణ, మెదక్. 12 ఆగస్టు (హి.స.)
ముందస్తు నేర నియంత్రణ చర్యల్లో భాగంగా మంగళవారం మెదక్ పట్టణం పిల్లికోటల్ లోని ఇళ్లలో తెల్లవారుజామున మెదక్ డీఎస్పీ ఆధ్వర్యంలో కార్డెన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. ఇద్దరు సీఐలు 8 మంది ఎస్ఐలు 97 మంది సిబ్బందితో మొత్తం 108 మంది పోలీస్ సిబ్బందితో దాదాపు 500 ఇళ్లల్లో సోదాలు చేశారు. ఈ సోదాలలో సరియైన పత్రాలు లేని 134 ద్విచక్ర వాహనాలు,13 త్రిచక్ర వాహనాలు, 2 కార్స్, 1 ట్రాలీ వెహికల్ ను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ ముఖ్యంగా ముందస్తు నేర నియంత్రణ చర్యల్లో భాగంగా కమ్యూనిటీ కాంటాక్ట్ లాంటి కార్యక్రమాలు నిర్వహించారన్నారు. దీనిలో భాగంగా ఇళ్లలో కార్డెన్ అండ్ సెర్చ్ కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు. కాలనీల్లో, ఇంటి ప్రదేశాల్లో అనుమానితులు ఎవరైనా కనబడితే వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వాలని కోరారు. కొత్తగా ఇండ్లకు అద్దె వచ్చే వారి పూర్తి వివరాలు తెలుసుకున్నాకే ఇవ్వాలని సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు