అమాయక మహిళలకు కుచ్చుటోపి.. రూ. 1 కోటి స్వాహా
రంగారెడ్డి, 12 ఆగస్టు (హి.స.) ఫోర్జరీ సంతకాలతో అమాయక మహిళలకు కుచ్చుటోపి వేసిన సంఘటన రంగారెడ్డి జిల్లాలోని యాచారం మండల చౌదర్ పల్లి, గ్రామంలో చోటుచేసుకోండి.. గ్రామస్తులు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గౌరి, తిరుమల, దుర్గ బాయి, హారతి, సాయిరాం, మల్
మహిళలకు టోపీ


రంగారెడ్డి, 12 ఆగస్టు (హి.స.)

ఫోర్జరీ సంతకాలతో అమాయక

మహిళలకు కుచ్చుటోపి వేసిన సంఘటన రంగారెడ్డి జిల్లాలోని యాచారం మండల చౌదర్ పల్లి, గ్రామంలో చోటుచేసుకోండి.. గ్రామస్తులు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గౌరి, తిరుమల, దుర్గ బాయి, హారతి, సాయిరాం, మల్లన్న, శ్రీనిధి, మణికంఠ, డ్వాక్రా గ్రూపులతో పాటు దాదాపు 25 మహిళా గ్రూపుల సభ్యులకు తెలియకుండానే వారి సంతకాలను ఫోర్జరీ చేసి దాదాపుగా ఒక కోటి వరకు స్వాహా చేసినట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని మంగళవారం ఎస్బీఐ బ్యాంకు ముందుబ్యాంకు సేవలను అడ్డుకొని చేపట్టారు. ప్రతి నెల బ్యాంకుకు వెళ్లి డబ్బులు చెల్లించి తాము తీసుకున్న అప్పును మొత్తం కట్టేసిన ఇంకా తీరలేదని బ్యాంకు అధికారులు చెబుతున్నారని తాము చెల్లించిన స్లిప్పులపై స్టాంపు మేము వెయ్యలేదని అధికారులు అంటున్నారని బుక్ కీపర్ బ్యాంకు మేనేజర్ కలిసే నిధులను స్వాహా చేశారని విమర్శిస్తున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకొని తమకు న్యాయం చేసే వరకు ఆందోళన విరమించేది లేదని బ్యాంకు మేనేజర్ వచ్చి సమాధానం చెప్పాలని తేల్చి చెబుతున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande