ఇండియన్.జర్నలిస్ట్ యూనియన్ ఆంధ్రప్రదేశ్ కు.అరుదైన అవకాశం
తాడేపల్లిగూడెం, 12 ఆగస్టు (హి.స.) ,ఇండియన్‌ జర్నలిస్ట్‌ యూనియన్‌(ఐజేయూ)లో ఆంధ్రప్రదేశ్‌కు అరుదైన అవకాశం దక్కింది. ఐజేయూ సెక్రటరీ జనరల్‌గా పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణానికి చెందిన సీనియర్‌ జర్నలిస్ట్‌ దూసనపూడి సోమసుందర్‌ ఎంపిక కానున్నారు
ఇండియన్.జర్నలిస్ట్ యూనియన్ ఆంధ్రప్రదేశ్ కు.అరుదైన అవకాశం


తాడేపల్లిగూడెం, 12 ఆగస్టు (హి.స.)

,ఇండియన్‌ జర్నలిస్ట్‌ యూనియన్‌(ఐజేయూ)లో ఆంధ్రప్రదేశ్‌కు అరుదైన అవకాశం దక్కింది. ఐజేయూ సెక్రటరీ జనరల్‌గా పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణానికి చెందిన సీనియర్‌ జర్నలిస్ట్‌ దూసనపూడి సోమసుందర్‌ ఎంపిక కానున్నారు. ఆయన ఇప్పటికే ఉమ్మడి రాష్ట్ర ఏపీయూడబ్ల్యూజే అధ్యక్షుడిగా, రాష్ట్రం విడిపోయిన తర్వాత రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన ఐజేయూ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. సోమసుందర్‌ నామినేషన్‌ను ఏపీయూడబ్ల్యూజే, టీయూడబ్ల్యూజేతో పాటు 17 రాష్ర్టాలు బలపరిచాయి. ఐజేయూ అధ్యక్ష పదవికి ప్రస్తుత సెక్రటరీ జనరల్‌ బల్విందర్‌ సింగ్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. రెండు పదవులకు ఒక్కొక్క నామినేషన్‌ మాత్రమే దాఖలు కావడంతో వీరి ఎన్నిక ఏకగ్రీవం కానుంది. నామినేషన్‌ను పాట్నాలో ఎన్నికల ప్రధాన అధికారి మహేష్‌ సిన్హాకు సోమసుందర్‌ సోమవారం సాయంత్రం అందజేశారు. ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు ఐవీ సుబ్బారావు ఈ కార్యక్రమానికి హాజరై సోమసుందర్‌తో నామినేషన్‌ వేయించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande