హైదరాబాద్, 12 ఆగస్టు (హి.స.)
: భాజపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావున) పోలీసులు గృహ నిర్బంధం చేశారు. నేడు బంజారాహిల్స్ పెద్దమ్మ గుడిలో భాజపా నేతలు కుంకుమార్చన చేయాలని నిర్ణయించారు. కొన్ని రోజుల క్రితం దుండగుడు ఈ ఆలయాన్ని ధ్వంసం చేయడంతో వివాదం నెలకొంది. ఇక్కడికి రామచందర్ రావు వెళ్తారనే సమాచారంతో హౌస్ అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు ఆయన నేడు హర్ ఘర్ తిరంగా యాత్రలో భాగంగా సికింద్రాబాద్, గోషామహల్ నియోజకవర్గాల్లో పర్యటించాల్సి ఉంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ