ఖమ్మం నగరంలోని బొమ్మరిలు అపార్ట్మెంట్ లో పట్టపగలే. చోరీ
ఖమ్మం, 12 ఆగస్టు (హి.స.) ఖమ్మం నగరంలోని బొమ్మరిల్లు అపార్ట్‌మెంట్‌లో పట్టపగలు చోరీ జరిగింది. రెండో పట్టణ సీఐ కథనం మేరకు.. నెలనెలా.. వెన్నెల నిర్వాహకుడు కె.దేవేంద్ర బొమ్మరిల్లు నాలుగో ఫ్లోర్‌లో నివాస ఉంటున్నారు. ఇటీవల ఆయన భార్య, విశ్రాంత ఉపాధ్యాయురాల
ఖమ్మం నగరంలోని బొమ్మరిలు అపార్ట్మెంట్ లో పట్టపగలే. చోరీ


ఖమ్మం, 12 ఆగస్టు (హి.స.)

ఖమ్మం నగరంలోని బొమ్మరిల్లు అపార్ట్‌మెంట్‌లో పట్టపగలు చోరీ జరిగింది. రెండో పట్టణ సీఐ కథనం మేరకు.. నెలనెలా.. వెన్నెల నిర్వాహకుడు కె.దేవేంద్ర బొమ్మరిల్లు నాలుగో ఫ్లోర్‌లో నివాస ఉంటున్నారు. ఇటీవల ఆయన భార్య, విశ్రాంత ఉపాధ్యాయురాలు ఝాన్సీ అమెరికా వెళ్లారు. దేవేంద్ర సోమవారం ఉదయం 11గంటల ప్రాంతంలో ఓ మిత్రుని ఇంటికి భోజనం చేసేందుకు వెళ్లారు. మధ్యాహ్నం 12గంటల సమయంలో ఇద్దరు వ్యక్తులు నేరుగా అపార్ట్‌మెంట్‌లోని ఆయన ఇంటి ముందున్న గేటు, తలుపులు పగలగొట్టి లోనికి చొరబడ్డారు. బీరువాను తెరిచి 18 తులాల బంగారం, నగదు, డాలర్లు, ఇతర వస్తువులను అపహరించుకొని వెళ్లారు. మధ్యాహ్నం 2:30 గంటల ప్రాంతంలో పనిమనిషి చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్లూస్‌ టీం, ఫింగర్‌ ప్రింట్‌ బృందాలతో తనిఖీలు చేపట్టారు. సీసీ కెమెరాలను పరిశీలించి కేసు దర్యాప్తు చేపట్టారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande