తిరుమల: ఓ వైపు భారీ వర్షాలు.. మరోవైపు భక్తుల రద్ధీ
తిరుమల, 12 ఆగస్టు (హి.స.)ఉపరితల ఆవార్తనం, ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు (Heavy rains) కురుస్తున్న విషయం తెలిసిందే. అయినప్పటికి తిరుమల తిరుపతి (Tirumala Tirupati)లో భక్తుల రద్ధీ (Crowd of devotees) ఏ మాత్రం తగ్గడం లేదు. రాఖీ
తిరుమలలో హై అలర్ట్


తిరుమల, 12 ఆగస్టు (హి.స.)ఉపరితల ఆవార్తనం, ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు (Heavy rains) కురుస్తున్న విషయం తెలిసిందే. అయినప్పటికి తిరుమల తిరుపతి (Tirumala Tirupati)లో భక్తుల రద్ధీ (Crowd of devotees) ఏ మాత్రం తగ్గడం లేదు.

రాఖీ పౌర్ణమి సందర్భంగా కాస్త తగ్గిన రద్దీ మంగళవారం ఉదయానికి మరోసారి భారీగా పెరిగింది. దీంతో ఈ రోజు ఉదయం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునేందుకు. 31 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. దీంతో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం టోకెన్ లేని భక్తుల సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతున్నట్లు టీటీడీ అధికారులు (TTD officials) తెలిపారు.

ఇదిలా ఉంటే సోమవారం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని 75,740 మంది భక్తులు దర్శించుకున్నారు. వారిలో 34,958 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. నిన్న ఒక్కరోజే భక్తుల కానుకల ద్వారా టీటీడీకి హుండీ ఆదాయం రూ.4.84 కోట్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు.

---------------

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande