దిల్లీ: , 14 ఆగస్టు (హి.స.) ఈసారి స్వాతంత్య్ర దిన వేడుకల్ని ‘ఆపరేషన్ సిందూర్’ విజయోత్సవంగా నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఆగస్టు 15న దేశంలోని 140 ప్రముఖ ప్రదేశాల్లో సాయుధ, పారా మిలిటరీ దళాల అధికారిక బ్యాండ్లు సంగీత ప్రదర్శన నిర్వహించనున్నాయి. ఆపరేషన్ సిందూర్ విజయానికి ప్రతీకగా ఈ ఏర్పాటు చేశారు. 79వ స్వాతంత్య్ర దినోత్సవ వైభవానికి సంగీత సౌరభాన్ని అద్దాలన్న ఉద్దేశంతో ఈ ప్రదర్శనలు నిర్వహించి దేశ పౌరులకు అద్భుత అనుభూతిని అందించనున్నట్లు రక్షణశాఖ పేర్కొంది. ఈ వేడుకల ఆహ్వాన పత్రికపై ‘ఆపరేషన్ సిందూర్’ లోగోను, అద్భుత ఇంజినీరింగ్ నిర్మాణంగా నిలుస్తున్న ప్రతిష్ఠాత్మక చినాబ్ బ్రిడ్జి రేఖా చిత్రాన్ని ముద్రించారు
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ