దిల్లీ:, 14 ఆగస్టు (హి.స.) అవసరమైన అన్ని పత్రాలు సమర్పిస్తే ఒక్క రోజులోనే భారతీయ వీసా లభించనుంది. గతంలో వీసా జారీకి వారాలు పట్టేది. కేంద్రం ఈ నిబంధనల్లో మార్పులు చేసింది. విదేశీ విభాగం అధికారులతో సమీక్ష అనంతరం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఈ విషయం వెల్లడించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ