దిల్లీ: , 14 ఆగస్టు (హి.స.) అభిశంసన ప్రక్రియ ప్రారంభిస్తూ లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా త్రిసభ్య కమిటీ నియమించిన నేపథ్యంలో పార్లమెంటు తనను తొలగించకుండా ఉండాలంటే జస్టిస్ యశ్వంత్ వర్మ ముందు మిగిలిన ఏకైక మార్గం రాజీనామాయే. కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాతే పార్లమెంటులో అభిశంసన ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఆ సందర్భంగా చట్టసభ సభ్యుల ముందు తన కేసును సమర్థించుకొనే అవకాశం జస్టిస్ వర్మకు లభిస్తుంది. ఆ సమయంలో తాను వైదొలగుతున్నానని జస్టిస్ వర్మ తెలపొచ్చని, మౌఖికంగా చెప్పిన ఆ ప్రకటనను రాజీనామాగా పార్లమెంటు పరిగణిస్తుందని సుప్రీంకోర్టు, హైకోర్జు జడ్జిల తొలగింపు ప్రక్రియపై అవగాహన ఉన్న అధికారులు తెలిపారు. ఒక వేళ జస్టిస్ వర్మ రాజీనామా చేయాలని నిర్ణయిస్తే పింఛను, హైకోర్టు జడ్జిగా ఇతర రిటైర్మెంట్ ప్రయోజనాలు ఆయనకు లభిస్తాయి. పార్లమెంటు తొలగిస్తే మాత్రం పింఛను, ఇతర ప్రయోజనాలు లభించవు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ