రాష్ట్ర హోదా కల్పించే ముందు స్థానిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరముంది-సుప్రీంకోర్టు
ఢిల్లీ: , 14 ఆగస్టు (హి.స.)జమ్ముకశ్మీర్‌కు రాష్ట్ర హోదా కల్పించే విషయంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. జమ్ముకశ్మీర్‌కు రాష్ట్ర హోదా కల్పించే ముందు స్థానికంగా ఉన్న పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరముంది అంటూ సర్వోన్నత న్యాయస్థానం స్పష
Supreme Court


ఢిల్లీ: , 14 ఆగస్టు (హి.స.)జమ్ముకశ్మీర్‌కు రాష్ట్ర హోదా కల్పించే విషయంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. జమ్ముకశ్మీర్‌కు రాష్ట్ర హోదా కల్పించే ముందు స్థానికంగా ఉన్న పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరముంది అంటూ సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఇదే సమయంలో ఇటీవల పహల్గాంలో జరిగిన దాడిని ప్రస్తావించింది.

జమ్ముకశ్మీర్‌కు రాష్ట్ర హోదా కల్పించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌, జస్టిస్ కె. వినోద్ చంద్రన్‌లతో కూడిన ధర్మాసనం నేడు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ధర్మాసనం.. రాష్ట్ర హోదా కల్పించే ముందు స్థానిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరముంది. వాస్తవాలను పరిగణనలోకి తీసుకోవాలని నొక్కి చెప్పింది. ఇటీవల పహల్గాంలో జరిగి దుర్ఘటనను విస్మరించలేమని వ్యాఖ్యానించింది. అనంతరం, రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలన్న పిటిషన్‌పై ఎనిమిది వారాల్లోగా సమాధానం దాఖలు చేయాలని ఆదేశిస్తూ కేంద్రానికి నోటీసులు జారీ చేసింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande