స్వల్ప లాభాల్లో మార్కెట్‌ సూచీలు.
ముంబయి,14 ఆగస్టు (హి.స.) దేశీయ స్టాక్‌మార్కెట్లు స్వల్పలాభాల్లో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఉదయం 9.19 సమయంలో నిఫ్టీ 29 పాయింట్లు పెరిగి 24,649, సెన్సెక్స్‌ 97 పాయింట్ల లాభంతో 80,637 వద్ద కొనసాగుతున్నాయి. ముత్తూట్‌ ఫినాన్స్‌, జేకే లక్ష్మీ సిమెంట్‌, ట
స్వల్ప లాభాల్లో మార్కెట్‌ సూచీలు.


ముంబయి,14 ఆగస్టు (హి.స.)

దేశీయ స్టాక్‌మార్కెట్లు స్వల్పలాభాల్లో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఉదయం 9.19 సమయంలో నిఫ్టీ 29 పాయింట్లు పెరిగి 24,649, సెన్సెక్స్‌ 97 పాయింట్ల లాభంతో 80,637 వద్ద కొనసాగుతున్నాయి. ముత్తూట్‌ ఫినాన్స్‌, జేకే లక్ష్మీ సిమెంట్‌, టిమ్‌కెన్‌ ఇండియా, సీఐఈ ఆటోమోటివ్‌, కావేరీ సీడ్స్‌ భారీ లాభాల్లో ఉండగా.. దీపక్‌ నైట్రైట్‌, సీఎస్‌బీ బ్యాంక్‌, సూర్య రోష్ని లిమిటెడ్‌ సంస్థల షేర్లు భారీగా కుంగాయి.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26)లో ద్రవ్యోల్బణం 3.5 శాతంగా నమోదయ్యే అవకాశం ఉందన్న రేటింగ్‌ సంస్థ క్రిసిల్‌ అంచనాలు, టారిఫ్‌ల ప్రభావంతో జీడీపీ వృద్ధి రేటు తగ్గదన్న చీఫ్‌ ఎకనామిక్‌ అడ్వైజర్‌ నాగేశ్వరన్‌ ప్రకటన వంటివి మార్కెట్‌పై సానుకూల ప్రభావం చూపాయి.

ఈసారి ఆహార ఉత్పత్తుల దిగుబడి మెరుగ్గా ఉండనుండటంతో ద్రవ్యోల్బణం అదుపులోకి రావొచ్చని క్రిసిల్‌ తెలిపింది

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande